News23rd Aug 12:10 PMSunil Byrisetty1 min read
శ్రీ దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలా కృష్ణారావు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మ దేవస్థానాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలా కృష్ణారావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గమ్మ దేవస్థానాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలా కృష్ణారావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలా కృష్ణారావు వారి సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి దుర్గ గుడిని సందర్శించారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికికి కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనానాయక్ ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. జస్టిస్ గోపాలా కృష్ణారావు కుటుంబసభ్యులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.