News3rd Apr 01:28 PMSunil Byrisetty1 min read

రిజర్వేషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలనం.. రైతులకూ..!

దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V రమణ అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు అసలేమాత్రం గుర్తింపు దక్కడం లేదన్నారు. అన్నదాతలు

రిజర్వేషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలనం.. రైతులకూ..!
దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V రమణ అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతుకు అసలేమాత్రం గుర్తింపు దక్కడం లేదన్నారు. అన్నదాతలు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం, ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం దక్షిణాదిలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు. పారిశ్రామికీకరణ పెరగడంతో వ్యవసాయం అంటరాని వృత్తిలా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభలతోపాటు అన్ని కీలక శాఖలు, వ్యవస్థల్లో రైతులకు తగిన ప్రాతినిధ్యం లభించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. లేదంటే ధనికుల పెత్తనంలనే వ్యవస్థలు మిగిలిపోతాయని, అన్నదాతలకు ఎలాంటి న్యాయం జరగదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Justice NV Ramana
Krishna district
Amaravati
రైతు సంఘాల
వ్యవసాయం
Scroll for the next article