News4th Aug 12:50 PMSunil Byrisetty1 min read
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్
ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధా
ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆయనచే ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ సమక్షంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ అదనపు అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.