News3rd Oct 10:12 AMSunil Byrisetty1 min read

దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్..ఏపీలో!

దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ప్రాంతంలో ఈ హార్బర్ నిర్మాణం జరుగుతోందని మత్స్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన క

దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్..ఏపీలో!
దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ప్రాంతంలో ఈ హార్బర్ నిర్మాణం జరుగుతోందని మత్స్య, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఈ హార్బర్‌ను సందర్శించి మత్స్యకారులకు భరోసా ఇస్తారని చెప్పారు. ఇప్పటికే కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ హార్బర్‌ను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ హార్బర్‌ను తన ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా ఉపయోగంలోకి తేవడానికి చర్యలు చేపడుతోంది. హార్బర్ నిర్వహణకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వార్షికంగా సుమారు రూ. 825 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 41,250 టన్నుల చేపల సంపత్తి లభించనుందని అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Nellore District
Fishing Harbor
Juvvaladinne
CM Chandrababu Naidu
Fisheries Department
B. Rajasekhar
రామ్‌శంకర్ నాయక్
చేపల ఉత్పత్తి
సముద్ర ఆర్థిక వ్యవస్థ
హార్బర్ కమిటీ
Scroll for the next article