News17th Oct 11:54 AMSunil Byrisetty1 min read
విశాఖలో పెట్టుబడులకు రహేజా ఆసక్తి
విశాఖకు ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ పెట్టుబడులతో రాబోతోంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం ఆ సంస
విశాఖకు ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ పెట్టుబడులతో రాబోతోంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం ఆ సంస్థ రూ.2172.26 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ప్రాజెక్ట్ అమలుకు మధురవాడ ఐటీ హిల్ నంబరు-3 లో 27.10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెష్ట ద్వారా సుమారు 9,881 మందికి ఉపాధి లభిస్తుందని తన ప్రతిపాదనల్లో పేర్కొంది. విశాఖలో గూగుల్ సంస్థ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి అనుబంధంగా భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. వాటికి కార్యాలయాల జాగా (ఆఫీస్ స్పేస్) అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మిలీనియం టవర్ 1, 2లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ జాగాను టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ దృష్ట్యా కొత్తగా వచ్చే కంపెనీలకు కార్యాలయ జాగాను అందుబాటులోకి తేవాల్సి ఉంది. రహేజా రెండు దశల్లో చేపట్టే ప్రాజెక్టు ద్వారా సుమారు 28. 65 లక్షల చ. అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.