News14th Jun 11:36 AMSunil Byrisetty1 min read

కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామాకు పాల్ డిమాండ్

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్ గురించి ఏమీ తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ప

కేంద్ర మంత్రి రామ్మోహన్ రాజీనామాకు పాల్ డిమాండ్
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్ గురించి ఏమీ తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో పాల్ స్పందించారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్‌కు ఏవియేషన్ గురించి ఏమీ తెలియదన్నారు. ఆయనకు ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. ఇంజనీరింగ్ చదవి ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. కీలకమైన ఏవియేషన్ రంగం నడిపించడం ఈజీ కాదన్నారు.
India news
Narendra Modi
ahmedbad plane crash
ka paul
ram mohan naidu
రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి
Scroll for the next article