Telangana4th Sep 11:39 AMSunil Byrisetty1 min read
ప్రజాశాంతిలోకి కొండా సురేఖ.. పాల్ ఆహ్వానం!
తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు బంపరాఫర్ లభించింది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆ ఆఫర్ ఇచ్చారు. సురేఖను తన పార్టీలోకి రావాలన్నారు. వేరే పార్టీల వైపు చూ
తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు బంపరాఫర్ లభించింది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆ ఆఫర్ ఇచ్చారు. సురేఖను తన పార్టీలోకి రావాలన్నారు. వేరే పార్టీల వైపు చూడాల్సిన అవసరం లేదని, తన పార్టీ ఉందని పాల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గ నేతల పదవులకు ఎటువంటి ఢోకా లేదని, కేవలం బీసీ నాయకుల పదవులకే గ్యారెంటీ లేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం ఒక్క ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని, అందుకే తన పార్టీలో చేరాలని సురేఖను పాల్ ఆహ్వానించారు. అయితే సురేఖ మంత్రి పదవి పోయినా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు.