News3rd Aug 10:11 AMSunil Byrisetty1 min read
గండికోట థీమ్‌తో కడప ఎయిర్‌పోర్ట్ టెర్మినల్
కడప ఎయిర్‌పోర్ట్ కొత్త లుక్‌లోకి మారనుంది. రూ.266 కోట్లతో రెండో టెర్మినల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గండికోట థీమ్‌తో ఆకట్టుకునేలా కొత్త టెర్మినల్ డిజైన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే
కడప ఎయిర్‌పోర్ట్ కొత్త లుక్‌లోకి మారనుంది. రూ.266 కోట్లతో రెండో టెర్మినల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గండికోట థీమ్‌తో ఆకట్టుకునేలా కొత్త టెర్మినల్ డిజైన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు 70% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2027 జనవరి నాటికి కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. రన్‌వే అభివృద్ధి, నైట్ ల్యాండింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని దేశీయ విమాన సర్వీసులకు అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వారణాసికి రెగ్యులర్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంటోంది.