News2nd Apr 09:04 AMSunil Byrisetty1 min read

కాలుష్యానికి దూరంగా కడప

దేశంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. అత్యంత కాలుష్యం నిండిన నగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ, పలు పారిశ్రామిక నగరాలు నిలుస్తు్న్నాయి. అయితే మన ఏపీలో కాలుష్యంతో ఉన్న నగరాల పరిస్థితేంటో

కాలుష్యానికి దూరంగా కడప
దేశంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. అత్యంత కాలుష్యం నిండిన నగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ, పలు పారిశ్రామిక నగరాలు నిలుస్తు్న్నాయి. అయితే మన ఏపీలో కాలుష్యంతో ఉన్న నగరాల పరిస్థితేంటో చూద్దాం. రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.
Kadapa
Clean Air
Andhra Pradesh
Nature
కాలుష్యం
Scroll for the next article