News27th May 04:25 PMSunil Byrisetty1 min read

‘మహానాడు’లో చేనేత సొబగులు

చేనేతల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని టీడీపీ మరోసారి చాటుకుంది. వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం న

‘మహానాడు’లో చేనేత సొబగులు
చేనేతల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధిని టీడీపీ మరోసారి చాటుకుంది. వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడు ప్రాంగణంలోనూ నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా చేనేత స్టాళ్లను ఏర్పాటు చేయించింది. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతన్నలు 11 స్టాళ్లను మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రూ.10 వేల విలువ చేసే చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. తనతో పాటు వచ్చిన అనుచరులతోనూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేయించారు.
Andhra Pardesh News
TDP
Kadapa
Mahanadu
Chnadra babu naidu
handlooms
మహానాడు ప్రాంగణంలో చేనేత స్టాళ్లను ఏర్పాటు
జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
Scroll for the next article