Politics26th Aug 04:16 PMSunil Byrisetty1 min read
కుప్పం వరకు నీళ్లిచ్చింది టీడీపీయే!
కడప జిల్లా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి వైసీపీపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్, పలు పథకాలతో ప్రజలకు సేవ చేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కడప జిల్లా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి వైసీపీపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్, పలు పథకాలతో ప్రజలకు సేవ చేస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారము అన్ని పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఒకేసారి 9,000 కోట్లతో తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. 700 కిలోమీటర్ల దూరంలో వున్న కృష్ణ జలాలను నందికొట్కూరు నుంచి తీసుకువచ్చి కుప్పంలోని చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చామని వివరించారు. గత ఐదేళ్లలో వైసిపి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఏ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకురాలేదని విమర్శించారు.