News19th Jan 11:58 AMSunil Byrisetty1 min read
ఢిల్లీ గణతంత్ర వేడుకలకు కడపవాసి పల్లవి
ఢిల్లీ భారత గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకోవచ్చారు. భారత సాంస్కృతిక శాఖ ఆహ్వానం మేరకు
ఢిల్లీ భారత గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకోవచ్చారు. భారత సాంస్కృతిక శాఖ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఆంధ్ర నుంచి 30 మంది కూచిపూడి కళాకారులను భారత సాంస్కృతిక శాఖ ఎంపిక చేసింది. వీరిలో కడపకు చెందిన పల్లవి ఒకరు. జనవరి 26వ తేదీన ఢిల్లీ వేదికగా ఎర్రకోటలో జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కడప జిల్లా కడప నగరం శంకరాపురం నివాసి అయిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు.