News23rd Dec 02:21 PMSunil Byrisetty1 min read

కాపు సేవా సమితి ఆధ్వర్యంలో.. కైకాల వర్ధంతి

నవరస నటనా సార్వభౌముడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ తృతీయ వర్థంతి కార్యక్రమాలను గుడివాడ కాపు సేవాసమితి, కళాకారుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి పెద

కాపు సేవా సమితి ఆధ్వర్యంలో.. కైకాల వర్ధంతి
నవరస నటనా సార్వభౌముడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ తృతీయ వర్థంతి కార్యక్రమాలను గుడివాడ కాపు సేవాసమితి, కళాకారుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి పెద్దలు, కళాకారుల సంఘ నాయకులు కైకాల విగ్రహానికి నివాళులు అర్పించి.. జోహార్ కైకాల అంటూ నినాదాలు చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో కైకాల నిలిచి ఉంటారని ఈ సందర్భంగా సేవాసమితి పెద్దలు కొనియాడారు. సాధారణ వ్యక్తిగా మొదలై లెజెండ్ స్థాయికి ఎదిగిన కైకాల ప్రజా నెతగా గుడివాడ, స్వగ్రామం కౌతవరం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. గుడివాడలో కైకాల కృషి ఫలితంగా ఏర్పాటైన కైకాల సత్యనారాయణ కళామందిరం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవ తీసుకొని, కళాకారులకు పట్టణ ప్రజలకు కళామందిరం సేవలను అందుబాటులోకి తేవాలని కళాకారుల సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
Kaikala Satyanarayana
Kapu Seva Samithi
Gudivada
Third Death Anniversary
Telugu Cinema Legend
Navarasa Actor
కైకాల సత్యనారాయణ కళామందిరం
నివాళులు
గుడివాడ
Scroll for the next article