News19th Aug 09:22 AMSunil Byrisetty1 min read
పర్యాటక కేంద్రంగా కైలాసగిరి
విశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఆకర్షణీయమైన ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతం కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని జిల్ల
విశాఖను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఆకర్షణీయమైన ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతం కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోం శాఖ మంత్రి అనిత, VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె ఎస్ విశ్వనాధన్ అన్నారు. కైలాసగిరి పై నూతనంగా చేపట్టబోతున్న త్రిశూలం ప్రాజెక్ట్ కు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పైలాన్ ను ప్రారంభించి, త్రిశూలం నమూనాను ప్రదర్శించారు. VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విశాఖకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునే విధంగా కైలాసగిరిపై రూ 1.55 కోట్లతో సుమారు 55 అడుగులతో డమరుకంతో కూడిన త్రిశూలం ఏర్పాటు చేస్తున్నామని, నగరం నుంచి చూస్తే అందరికీ కనిపించే విధంగా హనుమంతవాక వైపు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలోనే దేశంలోని అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జిను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసి, విశాఖ వచ్చే సందర్శకులకు, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం బీచ్ రోడ్ లో సుమారు రూ 3.50 కోట్ల నిధులతో నెలకొల్పిన UH3H హెలికాప్టర్ మ్యూజియంను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందర ప్రసాద్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.