Crime24th Aug 12:27 PMSunil Byrisetty1 min read

కాటేసిన కాలనాగుకు కఠిన శిక్ష పడుతుందా?

కాకినాడలో ఒక పండంటి కుటుంబం ప్రాణాలు తీసిన కాలనాగు సాధిక్ ఖాన్ ను ఉరి తీయాలని కులమతాలకతీతంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీరాజ్‌ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరిలో దూక

కాటేసిన కాలనాగుకు కఠిన శిక్ష పడుతుందా?
కాకినాడలో ఒక పండంటి కుటుంబం ప్రాణాలు తీసిన కాలనాగు సాధిక్ ఖాన్ ను ఉరి తీయాలని కులమతాలకతీతంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీరాజ్‌ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి బలవన్మరణానికి గురి కావడానికి కారకుడైన రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ షేక్‌ సాధిక్‌ఖాన్‌ పట్టుబడటంతో అతడికి మరణ శిక్షే సరైన శిక్ష అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. తన దగ్గర షూటింగ్‌ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డుపెట్టుకుని అతడి తండ్రిని విషం ఇంజెక్షన్ తో చంపి, తల్లిని బెదిరించి, ఆ ఇంటి వ్యవహారాలను, కుటుంబ సభ్యులను తన గుప్పెట పెట్టుకున్నాడు. వారి బంగారం, డబ్బు, ఏటీఎం కార్డులు లాక్కుని వేధింపులకు గురిచేశాడు. ఇంజినీర్‌ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా మానసిక హింసకు గురి చేశాడు. ఇంతటి కిరాతకుడి చేష్టలకు సాధిక్ కుటుంబం కూడా వంత పలకడంపై ఊరూవాడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అతడి కుటుంబ సభ్యులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాధిక్ ను నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా బీజేపీ నేత సోము వీర్రాజు ‘ఇది లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్’ కేసు అని, సాధిక్‌కు అంతర్జాతీయ స్థాయిలో లింకులున్నాయని, హోంమంత్రి, డీజీపీ రంగంలోకి దిగి అతడి వెనుక ఉన్న ముఠా అంతు చూడాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Kakinada
Sadiq Khan
Kakinada Family Tragedy
Crime
Arrest
Court Proceedings
Strict Punishment
కఠిన శిక్ష
నూకరాజు కుటుంబం
రైఫిల్ షూటింగ్ కోచ్
కాకినాడ
Scroll for the next article