News30th Sep 11:04 AMSunil Byrisetty1 min read
కన్ను మూసిన కల్కి భగవాన్
చిరుద్యోగి నుంచి ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన కల్కి భగవాన్ కన్నుమూశారు. భక్తుల కడపటి దర్శనార్థం శ్రీ గురుదేవుల భౌతిక దేహాన్ని వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం ప్రాంతంలో ఉన్న ‘ఏకం క్
చిరుద్యోగి నుంచి ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన కల్కి భగవాన్ కన్నుమూశారు.
భక్తుల కడపటి దర్శనార్థం శ్రీ గురుదేవుల భౌతిక దేహాన్ని వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం ప్రాంతంలో ఉన్న ‘ఏకం క్షేత్రం’లో ఉంచనున్నారు. మూడు రోజుల పాటు భక్తుల దర్శనానికి ఇక్కడ అవకాశం కల్పించనున్నారు. అనంతరం మహాసమాధి ప్రక్రియ నిర్వహించనున్నట్లు సమాచారం. కల్కి భగవాన్ అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. 1949 మార్చి 7న తమిళనాడులోని వెల్లూరు జిల్లా నాతం గ్రామంలో జన్మించారు. చెన్నైలోని డీజీ వైష్ణవ్ కళాశాలలో గణితశాస్త్రాన్ని ప్రధానాంశంగా తీసుకుని పట్టభద్రుడయ్యారు. కళాశాల విద్య పూర్తయిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ క్లర్క్‌గా పనిచేశారు. 1980లో ‘జీవాశ్రమం’ పేరుతో ఒక ఆశ్రమం తరహా పాఠశాలను ప్రారంభించారు. అనంతరం అది వన్‌నెస్ కేంద్రంగా మారింది. ప్రస్తుతం కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.