News15th Dec 03:04 PMSunil Byrisetty1 min read
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివ శ్రీనివాస్
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగల
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కల్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్ లో
నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ఎండీ రవిప్రకాష్ సారథ్యంలో పలు నిర్మాణ పనులు విజయవంతంగా చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.509 కోట్ల వ్యయంతో అనేక పోలీస్ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్‌కు సంబంధించిన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.