Entertainment7th Nov 03:13 PMSunil Byrisetty1 min read
కమల్ నయా అవతార్ ‘సండియార్’
కమల్ హాసన్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. తా
కమల్ హాసన్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌గా ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గ్రే గడ్డంతో, చిన్నగా కత్తిరించిన హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. డార్క్ బ్రౌన్ షర్ట్ ధరించిన ఆయన ఓ వాహనం కిటికీకి ఆనుకుని, నేరుగా ముందుకు చూస్తూ ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో ఆసక్తిని కలిగిస్తున్నారు. ‘సండియార్’ అనే టైటిల్ వినగానే భయంలేని, ధైర్యవంతమైన, శక్తిమంతమైన వ్యక్తి గుర్తుకొస్తాడు. కమల్ హాసన్ పోషిస్తున్న పాత్రకు ఈ టైటిల్ సరిపోతుందని చిత్రబృందం చెబుతోంది.