Spiritual17th Oct 11:38 AMSunil Byrisetty1 min read

మహాలక్ష్మీ దేవీ అవతారంలో జగన్మాత

“జై దుర్గా భవానీ.. జై జై మహాలక్ష్మీ!” అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకా

మహాలక్ష్మీ దేవీ అవతారంలో జగన్మాత
“జై దుర్గా భవానీ.. జై జై మహాలక్ష్మీ!” అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సిరిసంపదలు, సౌభాగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించే జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహాలక్ష్మీ స్వరూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని జగన్మాతను ప్రార్థిస్తున్నారు. మహాలక్ష్మీదేవిని ఐశ్వర్యం, ధాన్యసంపద, సౌభాగ్యం, శుభప్రదానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. ధనం మాత్రమే కాకుండా ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, కుటుంబ సౌఖ్యం వంటి సర్వశుభాలను ప్రసాదించే తల్లిగా కొలుస్తారు. అమ్మవారి కరుణాకటాక్షాలు తమ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు మనసారా వేడుకుంటున్నారు.
Scroll for the next article