Spiritual15th Oct 11:50 AMSunil Byrisetty1 min read

శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పరాశక్తి స్వరూపిణిగా, శ్

శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. పరాశక్తి స్వరూపిణిగా, శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా పూజలందుకునే అమ్మవారి దివ్య అలంకారం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. ఈ రోజు అమ్మవారిని బంగారు వర్ణపు చీరతో అలంకరణ చేస్తారు. సౌందర్యం, కరుణ, శక్తి, జ్ఞానాల సమ్మేళనంగా భావించే శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. చెరకు విల్లు, పుష్పబాణాలు, పాశాంకుశాలను ధరించిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి సేవలందించే దివ్య స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ లలితా త్రిపురసుందరీదేవికి సంప్రదాయం ప్రకారం పులిహోర, పెసర బూరెలను నైవేద్యంగా సమర్పించనున్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ప్రార్థిస్తారు. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, శ్రీచక్రారాధనలకు ఈ అమ్మవారి ఆరాధనలో విశేష ప్రాధాన్యం ఉంది.
Scroll for the next article