News25th Jul 09:29 AMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రి ఘాట్ మూసివేత!
భారీ వర్షాల నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ
భారీ వర్షాల నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున భద్రతా పరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల వాహనాలను కనకదుర్గ నగర్ వైపు మళ్లిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.