Spiritual25th Jul 04:31 PMSunil Byrisetty1 min read

వైభవంగా 'ఆషాఢ సారె' ఉత్సవాలు.

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాల్లో భ

వైభవంగా 'ఆషాఢ సారె' ఉత్సవాలు.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారెను అత్యంత శోభాయమానంగా సమర్పించారు. కొండపై ఉన్న కళావేదిక నుండి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు మరియు వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, గాజులు, చీర మరియు నూతన వస్త్రాల సారె సంభారాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి విచ్చేశారు.శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం పొందిన అనంతరం, ధర్మకర్తల మండలి సభ్యులు మహామండపం 6వ అంతస్తులో ప్రతిష్టించిన ఉత్సవమూర్తి అమ్మవారి ముందు సారె సంభారాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చక స్వాములు వారికి వేదఆశీర్వచనం అందజేసి, అమ్మవారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలను బహూకరించారు.
Andhra Pradesh
Ashada Sare
Ashada Festival
Kanaka Durga Temple
Indrakeeladri
Vijayawada
ఆధ్యాత్మికం
హిందూ పండుగలు
ఆలయ ఉత్సవాలు
వేద పూజలు
Scroll for the next article