Spiritual16th Oct 11:32 AMSunil Byrisetty1 min read
అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిపై నేడు తెల్లవారుజాము 1:00 గంట నుంచే శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మూలా నక్షత్రం పురస్కరించుకుని భక్తులకు జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీ దేవిగా జగన్మాత ద
ఇంద్రకీలాద్రిపై నేడు తెల్లవారుజాము 1:00 గంట నుంచే శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మూలా నక్షత్రం పురస్కరించుకుని భక్తులకు జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీ దేవిగా జగన్మాత దర్శనమిస్తున్నారు. ఉదయం 10:30 గంటల సమయానికి 80 వేల మంది భక్తులకు అమ్మవారి దర్శనం పూర్తయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా, సులభతరంగా దర్శనం సాగుతోంది. మూలా నక్షత్ర పర్వదినాన నేడు ఇంద్రకీలాద్రికి 2 లక్షలకు పైగా భక్తులు విచ్చేసే అవకాశాలున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రకటించారు.