Spiritual3rd Sep 01:41 PMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 దసరా ఉత్సవాలు!
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవి, 12న గాయత్రీదేవి అలంకరణ చేయనున్నారు. 13న అన్నపూర్
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవి, 12న గాయత్రీదేవి అలంకరణ చేయనున్నారు. 13న అన్నపూర్ణాదేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మకు అలంకరిస్తారు. 16న సరస్వతిదేవి అలంకరణ, 17న మహాలక్ష్మీదేవి, 18న దుర్గాదేవి అలంకరణల్లో అమ్మవారు దర్శనమిస్తారు. 19న మహిషాసురమర్థిని, 20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం ఘనంగా జరుగుతుంది.