News6th Jul 03:33 PMSunil Byrisetty1 min read

శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్యనాయుడు

శ్రీశైలం ప్రాజెక్టును గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్‌ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదో నంబర్ గేట్ ద్వారా వచ

శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్యనాయుడు
శ్రీశైలం ప్రాజెక్టును గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు పరిశీలించారు. ఆనకట్ట రేడియల్ క్రస్ట్‌ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదో నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బందేమీ లేదని చెప్పారు గేటు నుంచి నీటి లీకేజ్ 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. రేడియల్ క్రస్ట్‌గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్‌గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలని, కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. శ్రీశైలం గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని, శ్రీశైలం ఆనకట్ట నుంచి 60 మీటర్ల దూరంలో ప్లంజ్‌పూల్ ఉందని అభిప్రాయపడ్డారు. ప్లంజ్‌పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదని కన్నయ్యనాయుడు స్పష్టం చేశారు.
Andhra Pradesh news
srisailam
Srisailam Reservoir
dam
kanhaiya naidu
Srisailam project
tenth gate
water leak
శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కన్నయ్యనాయుడు
Scroll for the next article