Spiritual15th Sep 12:47 PMSunil Byrisetty1 min read

కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో గ్రామోత్సవం జరుగుతుంది. మరునాటిను

కాణిపాకం శ్రీవరసిద్ధివినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో గ్రామోత్సవం జరుగుతుంది. మరునాటినుంచి అంగరంగవైభోగంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా వాహన సేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు. కాణిపాకం వినాయక స్వామి భక్తులకు ఇవి మహోత్సవాలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని విశ్వాసం. తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. బహుదా నది ఒడ్డున కాణిపాక వినాయకుడు సర్వమత ఆరాధ్యుడుగా పూజలందుకుంటున్నాడు.
Kanipakam
Kanipakam Vinayaka
Varasiddhi Vinayaka
Brahmotsavams
Vinayaka Chavithi
Ganesh Festival
Vahana Seva
కల్యాణోత్సవం
రథోత్సవం
చిత్తూరు
బహుదా నది
ఆంధ్రప్రదేశ్ ఆలయాలు
హిందూ పండుగలు
భక్తి వార్తలు
Scroll for the next article