News5th Dec 12:17 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు బయోపిక్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మెన్ బొర్రా రాధాకృష్ణ , ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మెన్ బొర్రా రాధాకృష్ణ , ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాన్ని అందచేశారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగులో రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య పాత్ర లో నటిస్తున్నానని, రాజకీయాల్లో విలువలతో కలిగిన వ్యక్తి బయోపిక్ లో నటించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయో పిక్‌తో ముందుకు వస్తె చంద్రబాబు క్యారెక్టర్ లో నటించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాంచరణ్ నటిస్తున్న పెద్ది మూవీ లో మంచి పాత్ర లో నటిస్తున్నానని చెప్పారు.