Movie Poster18th May 04:58 PMSunil Byrisetty1 min read

కన్నప్ప కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు, నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ యూనిట్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది. కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడు

కన్నప్ప కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు, నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ యూనిట్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది. కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పోస్ట‌ర్లు, టీజర్‌లు, పాటలు ‘కన్నప్ప’ పై భారీ అంచ‌నాలు పెంచేశాయి. తాజాగా మేక‌ర్స్ మూవీ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో శివుడి పాత్ర‌ధారిగా అక్ష‌య్ కుమార్ నిలబడిన తీరు ఆక‌ట్టుకుంటోంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప మల్టీ స్టారర్ గా నిలవనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇత‌ర‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Tollywood
Kannappa Movie
akshay kumar
Poster Release
Manchu Vishnu
పోస్ట‌ర్‌లో శివుడి పాత్ర‌ధారిగా అక్ష‌య్ కుమార్
కన్నప్ప సినిమా జూన్ 27న విడుద‌ల
ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం
Scroll for the next article