Telangana2nd Jan 11:56 AMSunil Byrisetty1 min read
అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఇన్స్టాకు పోలీసుల లేఖ
నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్రికుడుగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి సొమ్ము చేసుకుంటున్న అన్వేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల
నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్రికుడుగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి సొమ్ము చేసుకుంటున్న అన్వేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. యూట్యూబర్ అన్వేష్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. విదేశాల్లోని అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. అన్వేష్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాగా హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై హిందూసంఘాలు మండిపడుతున్నాయి.