National26th Jul 10:57 AMSunil Byrisetty1 min read
నేడు కార్గిల్ విజయ్ దివస్
"దేశ సరిహద్దులను కాపాడేది కేవలం ఆయుధాలు కాదు..వాటి వెనుక నిలిచే సైనికుడి ధైర్యం, త్యాగం, దేశభక్తి." సరిగ్గా ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుద్ధమే కార్గిల్ యుద్ధం. 1999 వసంతకా
"దేశ సరిహద్దులను కాపాడేది కేవలం ఆయుధాలు కాదు..వాటి వెనుక నిలిచే సైనికుడి ధైర్యం, త్యాగం, దేశభక్తి." సరిగ్గా ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన యుద్ధమే కార్గిల్ యుద్ధం. 1999 వసంతకాలం... హిమాలయాల ఒడిలోని కార్గిల్ పర్వతాలు మంచుతో కప్పబడి నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక కుట్ర రూపుదిద్దుకుంటోంది. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్ సైనికులు నియంత్రణ రేఖ (LoC) దాటి భారత భూభాగంలోని ఎత్తైన శిఖరాలను రహస్యంగా ఆక్రమించారు. లక్ష్యం ఒక్కటే.. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిని తమ నియంత్రణలోకి తెచ్చి, లడఖ్‌ను భారత్ నుంచి వేరు చేయడం.
1999 మే 3.
కార్గిల్‌లోని మస్కో వ్యాలీ ప్రాంతంలో స్థానిక గొర్రెల కాపరి తాషి నామ్‌గ్యాల్ యాదవ్ తన గొర్రెలను మేపుతుండగా కొండలపై అనుమానాస్పద కదలికలను గమనించాడు. వెంటనే భారత సైన్యానికి సమాచారం అందించాడు. ఆ సమాచారం సాధారణం కాదు... అది భారత చరిత్రలో ఒక మహాయుద్ధానికి నాంది పలికింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన భారత సైన్యం వెంటనే 'ఆపరేషన్ విజయ్' ప్రారంభించింది.
1999 మే 26న, భారత వైమానిక దళం కూడా రంగంలోకి దిగి 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ద్వారా శత్రు స్థావరాలపై దాడులు ప్రారంభించింది. మే 27–28 తేదీల్లో భారత వైమానిక దళానికి చెందిన ఒక మిగ్-21, ఒక మిగ్-27 యుద్ధవిమానం, ఒక ఎంఐ-17 హెలికాప్టర్ యుద్ధంలో కోల్పోయాయి. ఫ్లైట్ లెఫ్టినెంట్ కె. నచికేత పాకిస్థాన్ చేతికి చిక్కి యుద్ధఖైదీగా మారినా, జూన్ 3న అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో , భారత్ అద్భుతమైన వ్యూహంతో విడుదలయ్యారు.