Politics17th Oct 03:27 PMSunil Byrisetty1 min read

ఏపీ పట్ల కర్ణాటక నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరం

ఏపీ పట్ల కర్ణాటక నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుని కుమారుడు ప్రియాం

ఏపీ పట్ల కర్ణాటక నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరం
ఏపీ పట్ల కర్ణాటక నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుని కుమారుడు ప్రియాంక్ ఖర్గేకి నేడు వయస్సుతో పాటు రాజకీయ అవగాహనలోనూ, జ్ఞానంలోనూ ఎదగడం అవసరమని సూచించారు. ఆయన మానసిక స్థితి గురించి అనుమానం వస్తుందన్నారు. మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి తనదైన మార్గం, సవాళ్లు మరియు అభివృద్ధి దిశ ఉంటుందని తెలిపారు. ఒక రాష్ట్ర నాయకుడు లేదా మంత్రి మరో రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు వివక్షతకు దూరంగా ఉండి, పరస్పర గౌరవం, నిర్మాణాత్మక వైఖరి లాంటి సంబంధాలను ప్రోత్సహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల ప్రజలు, సంస్కృతి, అభివృద్ధి గురించి గౌరవంతో మాట్లాడటం అవసరమన్నారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
Andhra Pradesh
Karnataka
Vishnu Vardhan Reddy
Priyank Kharge
BJP
Politics
AP Development
Interstate Relations
Congress
Political Statement
రాజకీయ ప్రతిస్పందన
అభివృద్ధి దిశ
రాష్ట్ర రాజకీయాలు
Scroll for the next article