News26th Apr 12:05 PMSunil Byrisetty1 min read

దద్దరిల్లిన దండకారుణ్యం.. భారీ ఎన్కౌంటర్!

ఛత్తీస్ గఢ్‌లో కాల్పుల మోతతో దండకారుణ్యం దద్దరిల్లింది. భద్రతా బలగాలు మావోయిస్టులతో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్-తెలంగ

దద్దరిల్లిన దండకారుణ్యం.. భారీ ఎన్కౌంటర్!
ఛత్తీస్ గఢ్‌లో కాల్పుల మోతతో దండకారుణ్యం దద్దరిల్లింది. భద్రతా బలగాలు మావోయిస్టులతో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. అయితే చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనిపై భద్రతా దళాల నుంచి స్పందన రాలేదు. దాదాపు వెయ్యి మంది మావోలు ఉన్నట్లుగా సమాచారం. మూడు రాష్ట్రాలకు సంబంధించిన భద్రతా దళాలు మోహరించి కూంబింగ్ నిర్వహించారు. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Telangana border Karreguttala
anti Naxal operation
Chhattisgarh Bijapur
28 మంది మావోయిస్టులు హతమయ్యారు
ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దు
Scroll for the next article