Spiritual14th Nov 12:36 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై కార్తీక శోభ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొండపై ఉన్న శ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొండపై ఉన్న శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈఓ శీనా నాయక్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సరిత, పద్మావతి ఠాకూర్, మన్నే కళావతి, రాఘవరాజు, అల్లు బుల్లి అబ్బాయి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సహస్ర దీపార్చనలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.