Spiritual21st Oct 04:12 PMSunil Byrisetty1 min read

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైలంలో నవంబర్‌ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసంలో గర్భాలయ, స

శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీశైలంలో నవంబర్‌ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీక మాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోజూ విడతలవారీగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు. రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేస్తున్నారు. యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Andhra Pradesh temples
Srisailam
Karthika Masam
Mallikarjuna Swamy
Bhramaramba Devi
Jyotirlinga
Temple Festivals
Devotees
Abhishekam
కార్తీక మాసం
ఆధ్యాత్మికం
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
Scroll for the next article