News5th Nov 04:00 PMSunil Byrisetty1 min read

సముద్రతీరంలో కార్తీక స్నానాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో శ్రీపాండురంగ స్వామి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్

సముద్రతీరంలో కార్తీక స్నానాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో శ్రీపాండురంగ స్వామి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం మంత్రి మంగినపూడి బీచ్ లో ప్రముఖ వేద పండితులు విష్ణుబొట్ల సూర్యనారాయణశర్మ ఆధ్వర్యంలో సముద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచమ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కాగడాతో సముద్ర దీపం వెలిగించి, పసుపు, కుంకుమ పూలు, హారతులతో సముద్రునికి స్వాగతం పలికారు. స్వయంగా మంత్రి భక్తులందరితో కలిసి పవిత్ర సముద్ర స్నానమాచరించి స్నాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యచంద్రులు సముద్రానికి ఒక ప్రత్యేక కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున భక్తులు మంగినపూడి బీచ్ కు వచ్చారన్నారు.
Karthika Pournami
Manginapudi Beach
Krishna District
Kollu Ravindra
Sea Bath
Devotees
Rituals
Panduranga Swamy Temple
పాండురంగ స్వామి దేవస్థానం
విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ
ఆధ్యాత్మిక కార్యక్రమం
Scroll for the next article