Spiritual14th Nov 01:35 PMSunil Byrisetty1 min read

చవితే కాదు పంచమి కూడా విశిష్టమే!

కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి మాదిరిగానే, ఈ పంచమి నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఈ రోజును కొన్ని పంచాంగాల్లో నాగ పంచమిగా పేర్కొన్నారు. నాగారాధనకు సంబంధించిన

చవితే కాదు పంచమి కూడా విశిష్టమే!
కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి మాదిరిగానే, ఈ పంచమి నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఈ రోజును కొన్ని పంచాంగాల్లో నాగ పంచమిగా పేర్కొన్నారు. నాగారాధనకు సంబంధించిన ముఖ్య రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి ఒకటి. నాగుల నుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లలను కాపాడుకోవడానికి చేసే పూజ ఇది. ఈ రోజున అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ అనే అయిదుగురు నాగ దేవతలను స్మరించుకుంటారు. 1. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని నిత్యపూజ పూర్తి చేయాలి. 2. దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి నీళ్లు జల్లి, ముగ్గు వేసి పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించాలి. 3. పుట్ట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి, అగరొత్తులు వెలిగించాలి. 4. నైవేద్యం: చలిమిడి, నువ్వుల పిండి / చిమిలి, వడపప్పు, ఆవు పాలు నివేదించడం ఆనవాయితీ. నాగుల చవితికి నువ్వుల పిండి, చలిమిడి, వడపప్పు తప్పనిసరిగా సమర్పించాలని చెబుతారు. 5. పుట్టలో పాలు పోసేటప్పుడు కొద్దిగా మాత్రమే వేసి, మిగిలినవి ప్రసాదంగా స్వీకరించడం మంచిదని చెబుతారు. 6. ఇంట్లో అయితే గోడ మీద నాగుల ఆకారాన్ని తీర్చిదిద్ది కూడా పూజ చేసుకుంటారు.
Scroll for the next article