Politics2nd Apr 12:02 PMSunil Byrisetty1 min read
వైసీపీ వచ్చాక లెక్కలు తేలుస్తాం.. పోలీసులపై కాసు ఫైర్!
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. గురజాల సబ్ జైల్లో ఉన్న పిన్నెల్లి గ్రామానికి చెందిన అ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు.
గురజాల సబ్ జైల్లో ఉన్న పిన్నెల్లి గ్రామానికి చెందిన అల్లాభాషు, సైదాలను ఆయన పరామర్శించి మాట్లాడారు. కేసుల నమోదులో పోలీసులు కొత్త దారి చూపించారన్నారు.
ఘటనలు జరిగినప్పుడు కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెండేళ్ల క్రితం జరగని సంఘటనలను జరిగినట్టుగా కల్పించి కేసు నమోదు ఎలా చేస్తారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ అన్యాయాలను వెలికి తీస్తామన్నారు.
టీడీపీ నాయకుల మెప్పు కోసం సీఐలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, నాలుగేళ్ల తర్వాత మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అదే పోలీస్ స్టేషన్లో ఆ అధికారిపైనే నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. రెండేళ్లు ఉద్యోగం చేసుకుని, టీడీపీ మెప్పు పొందామనుకుంటే కుదరదన్నారు.
అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.
గురజాలలో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న ఏ ఒక్కరినీ వదలబోమన్నారు.
ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా భరించి కలసికట్టుగా నిలబడి మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని తీరతామని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు.