Crime27th Sep 09:34 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేకే సైబర్ నేరగాళ్ల టోకరా..
లింకు పెట్టి లక్షలు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డిని సైతం ఇదే తరహాలో దోచేశారు. ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ
లింకు పెట్టి లక్షలు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డిని సైతం ఇదే తరహాలో దోచేశారు. ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు 22న ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సప్ నంబర్‌కు ఓ లింకు వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలుగా భావించిన ఆయన దానిపై క్లిక్ చేశారు. అనంతరం సిమ్ బ్లాక్ అయింది. వెంటనే ఆయన హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 25 రోజుల తర్వాత సిమ్ యాక్టివేట్ అయింది. అయితే, గతనెల 25 నుంచి ఈ నెల 16 వరకు తన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ ద్వారా దశల వారీగా రూ.23,16,009 నగదు మాయమైనట్లు తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించిన ఆయన కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు