Telangana27th Aug 05:18 PMSunil Byrisetty1 min read

ఆంధ్రా వాళ్ల చేతిలో రేవంత్ బందీ

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ స్థాపించిన కవిత ఆంధ్రాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆంధ్రా వాళ్ల చేతిలో రేవంత్ బందీ అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చ

ఆంధ్రా వాళ్ల చేతిలో రేవంత్ బందీ
తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ స్థాపించిన కవిత ఆంధ్రాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆంధ్రా వాళ్ల చేతిలో రేవంత్ బందీ అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏపీ వాళ్లకి కట్టబెట్టారన్నారు. A రేవంత్ ‌రెడ్డి అంటే ఆంధ్రా రేవంత్‌ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్ట బోర్డులో వేరే ప్రాంతం వారికి స్థానం ఎలా ఇచ్చారని నిలదీశారు. ఏపీకి చెందిన సంస్థల్లో తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలిస్తున్నారా అనడిగారు. రేవంత్-హరీష్ రావు మధ్య లండన్‌లో లాలూచీ పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics
kavitha
Revanth Reddy
Andhra Pradesh
Telangana Rakshana Sena
Political Allegations
Telangana Congress
Andhra Telangana Relations
బ్రాహ్మణ పరిషత్
యాదాద్రి ఆలయ బోర్డు
హరీష్ రావు
తెలంగాణ న్యూస్
రాజకీయ వివాదం
Scroll for the next article