Telangana31st Dec 01:04 PMSunil Byrisetty1 min read

ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ పోరాటానికి పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజ

ఉద్యమకారులతో కలిసి కవిత భూ పోరాటం
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ పోరాటానికి పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలాన్ని వెంటనే ఇవ్వాలని, మళ్లీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఉద్యమకారుల చెమట, త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వారికి గౌరవం దక్కలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన పెన్షన్, సంక్షేమ బోర్డు, భూమి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ గడ్డపై చేసిన ప్రతి ఉద్యమం సక్సెస్ అవుతుందని, ఈ భూ పోరాటం కూడా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకోవాలని ఉద్యమకారులకు కవిత పిలుపునిచ్చారు.
Telangana Movement
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruti
Land Struggle
Bhoo Poratam
Karimnagar
Telangana Activists
Congress Government
హామీల అమలు
సంక్షేమ బోర్డు
పెన్షన్ డిమాండ్
Scroll for the next article