Telangana15th Nov 04:14 PMSunil Byrisetty1 min read

సోషల్ మీడియాలో బలం ఉంటే చాలదు: కవిత

బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుని గెలుస్తున్నామని సంబరపడిపోయిన పార్టీ శ్రేణులకు దిమ్మతిరిగింది. తాజాగా ఆ పార్

సోషల్ మీడియాలో బలం ఉంటే చాలదు: కవిత
బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుని గెలుస్తున్నామని సంబరపడిపోయిన పార్టీ శ్రేణులకు దిమ్మతిరిగింది. తాజాగా ఆ పార్టీ తీరును కల్వకుంట్ల కవిత కూడా ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియానే ఉందని..క్యాడర్ లేదన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా నిజం తెలుసుకుని.. వాస్తవ ప్రపంచంలోకి రావాలని సలహా ఇచ్చారు. బీఆర్ఎస్ క్యాడర్ తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండి క్యాడర్ ను పెంచుకోలేదని.. జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారు వందల కోట్లు మాత్రం పోగేసుకున్నారన్నారు. వీళ్ల అరాచకాల వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని కవిత తీవ్ర విమర్శలు చేశారు.
Telangana Politics
Kavitha
BRS Party
Jubilee Hills By-election
KTR
Social Media Politics
Election Analysis
రాజకీయ విమర్శలు
బీఆర్ఎస్ క్యాడర్
కల్వకుంట్ల కవిత
Scroll for the next article