Telangana20th Sep 04:21 PMSunil Byrisetty1 min read
సినిమా స్టైల్లో కాన్వాయ్.. 200 కార్లతో.!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సొంత పార్టీ పెట్టిన ఆమె సొంత కేడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు భారీ ప్రజా సమ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సొంత పార్టీ పెట్టిన ఆమె సొంత కేడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు భారీ ప్రజా సమీకరణ చేసే దిశగా బల ప్రదర్శనలు చేస్తున్నారు. తాజాగా 200 కార్ల భారీ కాన్వాయ్ తో కొడంగల్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బయలుదేరి వెళ్లారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో సినిమా స్టైల్‌ను తలపించేలా దూసుకెళ్లారు.
హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ వద్ద కవితకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.