Telangana2nd Jan 02:56 PMSunil Byrisetty1 min read
ప్రాణాలను పణంగా పెడితే ఉరి తీయాలంటారా?
మాజీ సీఎం కేసీఆర్‌ను ఉరి తీయాలనటంపై జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా కొట్లాడిన కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయటం
మాజీ సీఎం కేసీఆర్‌ను ఉరి తీయాలనటంపై జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా కొట్లాడిన కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. కేసీఆర్‌ను ఉరి తీయాలంటే ఆయన బిడ్డగా తన రక్తం మరుగుతోందన్నారు. కృష్ణా జలాలపై సభలో కేసీఆర్ మాట్లాడి అధికార పక్షం నోరు మూయించాలన్నారు. అలాగైతేనే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టకడుతుందన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు షూటర్ కాదని, బబుల్ షూటర్ అని కవిత అన్నారు. పిల్ల కాకులకు అసెంబ్లీలో బాధ్య తలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు.