Telangana19th Oct 09:44 AMSunil Byrisetty1 min read
తిరుమల శ్రీవారి సేవలో కల్వకుంట్ల కవిత దంపతులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. కవిత ద
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశ్వీరచనం చేసిన అర్చకులు.. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. కవిత మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటామన్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని సంకల్పించానని, యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని వచ్చానని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని కవిత పేర్కొన్నారు.