Telangana31st Jul 12:47 PMSunil Byrisetty1 min read
ఏపీపై అంత విద్వేషం అవసరమా?
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పని చేసి, ఆ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత మరోసారి ఏపీపై విద్వేషాన్ని ప్రదర్శించారు. కృష్ణమ్మను చెరబట్టి దక్షిణ తెలంగాణను
బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పని చేసి, ఆ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత మరోసారి ఏపీపై విద్వేషాన్ని ప్రదర్శించారు. కృష్ణమ్మను చెరబట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఏపీ పాలకులు రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నీళ్లు మనకు దక్కకుండా ఎత్తులు వేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. తమకు కొమ్ముగాసే రేవంత్ రెడ్డి అండతో గోదావరి నీళ్లను కొళ్లగొట్టే కుట్రలు వేగవంతం చేశారని అక్కసు ప్రదర్శించారు. నదీజలాలపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కేటాయింపులపై విమర్శలు చేశారు. గోదావరి నదిలో 964 టీఎంసీలు తెలంగాణ సొంతం.. ట్రిబ్యునల్ రక్షణ ఉన్న నీటి కేటాయింపులు చెల్లవని.. తెలంగాణ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరడం ముమ్మాటికీ మన హక్కులను కాలరాయడమేనంటూ కొత్త రాజకీయానికి తెర లేపే ప్రయత్నాలు ప్రారంభించారు. కవిత రాజకీయం చేసుకోవాలి కానీ ఏపీపై విద్వేషం వ్యక్తం చేయడమేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు.