News16th Oct 10:29 AMSunil Byrisetty1 min read

శిథిలమై.. ప్రమాదకరంగా 'కాజ' వంతెన !.

మంగళగిరిలోని కాజ నుంచి నంబూరు వైపు వెళ్లే రోడ్డు మార్గంలో సుమారు ఐదారు దశాబ్దాల క్రితం గుంటూరు ఛానల్ పై కాజ వద్ద నిర్మించిన వంతెన శిథిలమై దాదాపు కూలిపోయే దశకు చేరుకుంది. ఈ మార్గంలో

శిథిలమై.. ప్రమాదకరంగా 'కాజ' వంతెన !.
మంగళగిరిలోని కాజ నుంచి నంబూరు వైపు వెళ్లే రోడ్డు మార్గంలో సుమారు ఐదారు దశాబ్దాల క్రితం గుంటూరు ఛానల్ పై కాజ వద్ద నిర్మించిన వంతెన శిథిలమై దాదాపు కూలిపోయే దశకు చేరుకుంది. ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయ్.టోల్ గేట్ ఫీజులు తప్పించు కునేందుకు అనేక వాహనాలు ఈరోడ్డులోనే తిరుగుతున్న ఫలితంగానూ వంతెన పాడైందని రైతులు వాపోయారు. వంతెనకు రెండు వైపుల రైలింగ్ ఐనా అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. అతి వేగంగా వెళ్లే వాహనాలు వంతెనపై నుంచి కాలువ లోకి దూసుకు పోయే ప్రమాదం పొంచి వుంది. శిథిలమైన వంతెన స్థానంలో కొత్త వంతెన విస్తరించి నిర్మించాలని గత ప్రభుత్వ హయంలో చేసిన విజ్ఞప్తి కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వ మైనా ప్రత్యేక శ్రద్థ చూపి వంతెన నిర్మించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Andhra Pradesh
Kaza Bridge
Mangalagiri
Guntur
Bridge Collapse Risk
Public Safety
Infrastructure Alert
రోడ్డు భద్రత
ప్రభుత్వం చర్య అవసరం
Scroll for the next article