Politics7th Mar 01:03 PMSunil Byrisetty1 min read
జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్
60 పనిదినాలపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందనే నిబంధనను తప్పించుకునేందుకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైయస్ జగన్ తొలిరోజు హాజరయ్యారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ మాజీ
60 పనిదినాలపాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందనే నిబంధనను తప్పించుకునేందుకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైయస్ జగన్ తొలిరోజు హాజరయ్యారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా నడుస్తున్నారు.
తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్ తరహాలో అనర్హతా వేటు ముప్పును తప్పించుకోవడానికి ఇలా హాజరవ్వాలని అనుకుంటున్నారు.
నిజానికి ఆయన గతంలోనూ ఒక రోజు హాజరు కాగా.. ఈసారి అలాగే చేయాలనుకుంటున్నారట.
ఏపీలో అనర్హత వేటు రాజకీయం జరిగింది కానీ తెలంగాణలో ఇలాంటి ప్రకటన ఎవరూ చేయలేదు.
అయినా కాంగ్రెస్ కు చాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ అనుకుంటున్నారు.
అయితే సీనియర్ అయిన కేసీఆర్ ఒక్క రోజు హాజరుకు గవర్నర్ ప్రసంగాన్ని కాకుండా.. బడ్జెట్ ప్రసంగాన్ని ఎంచుకుంటున్నారు.
గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరయ్యారు.కానీ అది బిజినెస్ డే కాదని అసెంబ్లీ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.