News13th Sep 12:24 PMSunil Byrisetty1 min read
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరి
తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం ఉదయం స్వీకరించారు. ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు కలె
తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం ఉదయం స్వీకరించారు. ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తో మౌలిక వసతులు కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.