News5th Apr 09:06 AMSunil Byrisetty1 min read

పల్నాడులో కేంద్రీయ విద్యాలయాలు

పల్నాడు జిల్లా రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనందున అవసరమైన స్థలాన్ని త్వరితగతిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబంధిత అధికారులు ఆదేశ

పల్నాడులో కేంద్రీయ విద్యాలయాలు
పల్నాడు జిల్లా రొంపిచర్ల, మాచర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూరైనందున అవసరమైన స్థలాన్ని త్వరితగతిని అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబంధిత అధికారులు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో రెవెన్యూ అధికారులు, కేంద్రీయ విద్యాలయ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్లలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి తక్షణమే తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారికి సూచించారు. మాచర్ల రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాచర్లలోని పిడబ్ల్యుడి కాలనీ, జిల్లా పరిషత్ బాయ్స్ పాఠశాలలో రూములు కేటాయించదానికి అనువుగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా పిడబ్ల్యుడి కాలనీలో 5 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయ అధికారులతో క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రొంపిచర్లలో మంజూరైన కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని రీ వెరిఫై చేయాలనీ సంబంధిత మండల రెవెన్యూ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గురజాల రెవిన్యూ డివిజన్ అధికారి మురళీ కృష్ణ, నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత, రొంపిచర్ల మండల రెవెన్యూ అధికారి నిర్మల, కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Palnadu
Kendriya Vidyalaya
జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
Scroll for the next article