Crime17th Mar 10:48 AMSunil Byrisetty1 min read
ప్రాణం తీసిన వాటర్ ఫాస్ట్
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న కేరళకు చెందిన 18 ఏళ్ల శ్రీనంద తీసుకున్న పొరపాటు నిర్ణయం ఆమె జీవితాన్ని ముగించేసింది. బాల్యం నుంచే బొద్దుగా ఉండే ఆమెను "ఇంత లావుగా ఉన్నావేంటని ఏడిపిస్త
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న కేరళకు చెందిన 18 ఏళ్ల శ్రీనంద తీసుకున్న పొరపాటు నిర్ణయం ఆమె జీవితాన్ని ముగించేసింది.
బాల్యం నుంచే బొద్దుగా ఉండే ఆమెను "ఇంత లావుగా ఉన్నావేంటని ఏడిపిస్తుండటంతో సన్నబడాలని నిర్ణయించుకుంది.
ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆమెను సోషల్ మీడియాలో "వాటర్ ఫాస్టింగ్" వీడియో విపరీతంగా ఆకర్షించింది.
నీళ్లు మాత్రమే తీసుకుంటూ వేగంగా బరువు తగ్గే ఈ ప్రక్రియను ఆమె వెనకా ముందు ఆలోచించకుండా అమలు చేసింది.
డైట్లో భాగంగా భోజనం మానేసిన ఆమె రోజూ గోరువెచ్చటి నీళ్లు మాత్రమే తాగేది.
భోజనాన్ని దాచిపెట్టి ఎవరూ చూడనప్పుడు బయటపడేస్తూ ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా చూసుకుంది.
దీంతో కొన్ని నెలల్లోనే సగానికి సగం బరువు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.
షుగర్, బీపీ, శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో అప్పటికప్పుడు ఆస్పత్రిలో చేర్పించిన ఆమె తల్లిదండ్రులకు డాక్టర్లు షాకింగ్ విషయాలు చెప్పారు.
శ్రీనంద అనరెక్సియా నెర్వొసా అనే ఈటింగ్ డిజార్డర్ బారిన పడినట్లు వివరించారు.
ఐసీయూలో, ఆ తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది.
ఎలక్ట్రోలైట్స్ సరిపడా అందక గుండె కండరాలు స్తంభించి, పలు అవయవాల పనితీరు ఆగిపోవడంతో చివరకు కన్నుమూసింది.